చిరుధాన్యాలను సాగు చేసుకోవాలి
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:50 AM
ప్రతి రైతు చిరుధాన్యాలను సాగు చేసుకోవాలని ఏరువాక ప్రధాన కేంద్రం శాస్త్రవేత్త సుజాతమ్మ అన్నారు.

ఏరువాక ప్రధాన కేంద్రం శాస్త్రవేత్త సుజాతమ్మ
గోనెగండ్ల, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): ప్రతి రైతు చిరుధాన్యాలను సాగు చేసుకోవాలని ఏరువాక ప్రధాన కేంద్రం శాస్త్రవేత్త సుజాతమ్మ అన్నారు. ఇండియన ఇనస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రిసెర్చ్ వారి సహకారంతో ఏరువాక కేంద్రం కర్నూలు శాఖ వారి ఆధ్వర్యంలో కులుమాల గ్రామంలో చిరుధాన్యాలపై అవగాహన, రైతు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు మాట్లాడుతూ జొన్న, సజ్జ, రాగులు, సామ, ఊద, అరికలు, వరిగసాగు, మెలకువలు, వివరించారు. మేలురకపు కలుపు యాజమాన్యం, మార్కెటింగ్ పద్ధతులను తెలియజేశారు. సమావేశంలో శాస్త్రవేత్తలు రవికి శోర్, ఏడీఏ మహుమ్మద్ ఖాద్రీ, ఏవో హేమలత, గ్రామ ఉద్యన సహాయ కులు రహీమ్, ఎఫ్‌పీవో సభ్యులు వెంకటేశ్వర్లు, రామాంజినేయులు, రైతులు పాల్గొన్నారు.