పత్తి విక్రయానికి స్లాట్ బుకింగ్
ABN , Publish Date - Oct 23 , 2025 | 10:43 PM
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కు పత్తి విక్రయించుకోవాలంటే రైతులు ముందుగానే తమ పేర్లు, స్లాట్ బుక్ చేసుకోవాలని మార్కెట్ యార్డ్ కార్యదర్శి గోవిందు తెలిపారు.
27 నుంచి మద్దతు ధరతో సీసీఐ కొనుగోలు
మార్కెట్ యార్డ్ సెక్రెటరీ గోవిందు
ఆదోని అగ్రికల్చర్, అక్టోబర్ 23 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కు పత్తి విక్రయించుకోవాలంటే రైతులు ముందుగానే తమ పేర్లు, స్లాట్ బుక్ చేసుకోవాలని మార్కెట్ యార్డ్ కార్యదర్శి గోవిందు తెలిపారు. గురువారం తన కార్యాలయంలో సీసీఐ ప్రతినిధులతో ఆయన సమావేశమై మాట్లాడారు. మార్కెట్‌లో పత్తి ధరలు పతనం కావడంతో రైతులు సీసీఐకి విక్రయించుకునేందుకు ఎక్కువ యాప్‌ను తమ ఆండ్రాయిడ్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. సీఎం యాప్‌లో గ్రామాల్లోని ఆర్‌ఎ్‌సకేలతో తమ పేర్లను నమోదు చేసుకుంటే విక్రయించుకునే తేదీ, కొనుగోలు పరిశ్రమ ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేస్తుందన్నారు. ఈనెల 27వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని సీసీఐ ప్రతినిధి శ్రీనివాసులు తెలిపారు. రైతులు తొందరపడి తక్కువ ధరకు బయటి వ్యాపారులకు అమ్ముకొని నష్టపోవద్దన్నారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా ప్రణాళికాబద్ధంగా, ప్రభుత్వ నిబంధనల మేరకు రైతుల నుంచి కొనుగోలు చేస్తామన్నారు. రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, ఈ- క్రాప్ బుకింగ్ తప్పకుండా నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సహాయ కార్యదర్శి శాంతకుమార్ సూపర్‌వైజర్లు మోహన్ రెడ్డి, రామాంజినేయులు పాల్గొన్నారు.