జాతీయ జెండాతో స్కేటింగ్ క్రీడాకారుల ర్యాలీ
ABN , Publish Date - Nov 09 , 2025 | 11:19 PM
వందేమాతరం గేయాన్ని ఆలపిస్తూ కర్నూలులో స్కేటింగ్ క్రీడాకారులు ఆదివారం ఉద యం స్కేటింగ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
నగరంలో ‘వందేమాతరం’ గేయాన్ని ఆలపిస్తూ..
కర్నూలు స్పోర్ట్స్, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): వందేమాతరం గేయాన్ని ఆలపిస్తూ కర్నూలులో స్కేటింగ్ క్రీడాకారులు ఆదివారం ఉద యం స్కేటింగ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం గేయానికి 150 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట్ర రోలర్ స్కేటింగ్ ఆదేశాలతో కర్నూలు జిల్లా రోలర్ స్కేటింగ్ సం ఘం ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాను చేతపట్టి కర్నూలు డీ ఎస్‌ఏ స్టేడియం నుంచి ఈర్యాలీ కొండారెడ్డి బురుజు వరకు కొనసాగింది. ర్యాలీలో పలు పాఠశాలల స్కేటింగ్ క్రీడాకారులు, జిల్లా స్కేటింగ్ సంఘం కార్యదర్శి అబూబకర్, జిల్లా స్కేటింగ్ సంఘం సీఈవో పి.సునీల్‌కుమార్, స్కేటింగ్ సంఘం సభ్యులు శిరీష్‌బాబు, వీరేష్, నారాయణ, హనుమంతు క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.