Share News

పోలీస్‌స్టేషన ముందు బైఠాయింపు

ABN , Publish Date - Jun 01 , 2025 | 01:02 AM

మండలంలోని చెట్నహల్లి గ్రామ శ్మశాన వివాదంలో దళితుల ఇళ్లపైకి వచ్చి దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని జైభీమ్‌ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు జిక్కిం జానయ్య, జిల్లా ప్రధాన కార్యద ర్శి గర్జి హనుమన్నలు డిమాండ్‌ చేశారు.

పోలీస్‌స్టేషన ముందు బైఠాయింపు
మంత్రాలయం పోలీస్‌ స్టేషన ముందు బైఠాయించిన చెట్నహల్లి గ్రామ దళితులు, జైభీమ్‌ ఎమ్మార్పీఎస్‌ నాయకులు

మంత్రాలయం, మే 31(ఆంధ్రజ్యోతి): మండలంలోని చెట్నహల్లి గ్రామ శ్మశాన వివాదంలో దళితుల ఇళ్లపైకి వచ్చి దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని జైభీమ్‌ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు జిక్కిం జానయ్య, జిల్లా ప్రధాన కార్యద ర్శి గర్జి హనుమన్నలు డిమాండ్‌ చేశారు. శనివారం రాత్రి మంత్రా లయం పోలీస్‌ స్టేషన ముందు దాదాపు గంటసేపు బైఠాయించి నిరస న వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసే వరకు కదిలేది లేదని భీష్మించారు. వెంటనే దాడి చేసిన 25 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేసి దళితులకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జైభీమ్‌ ఎమ్మర్పీఎస్‌ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు దానియేలు, నరసింహులు, రవి, రాజు, మారెప్ప, ఉన్నారు.

చెట్నహల్లిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు: ఇరువర్గాల మధ్య శ్మశాన వివాదం చెలరేగడంతో డీఎప్పీ ఉపేంద్రబాబు ఆదేశాల మేరకు సీఐ రామాంజులు, మాధవరం ఎస్‌ఐ విజయకుమార్‌ దాదాపు 20 మంది పోలీసులు చెట్నహల్లి గ్రామంలో బందోబస్తు చేపట్టారు. అనవసరమైన గొడవలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఘర్షణలకు ప్రేరేపిస్తే సహించేది లేదని సీఐ రామాంజులు హెచ్చరించారు.

Updated Date - Jun 01 , 2025 | 01:02 AM