సార్.. ఓ సీటు ప్లీజ్
ABN , Publish Date - Jun 16 , 2025 | 12:47 AM
మండలంలోని కస్తూర్బా, మోడల్, గురుకుల పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఎంపీ, ఎమ్మెల్యేల వద్దకు వెళుతున్నారు.

మోడల్, కేజీబీవీ, గురుకుల సీట్ల కోసం ఎంపీ, ఎమ్మెల్యే వద్దకు తల్లిదండ్రులు
సిఫారసు లేఖలను చూసి, తలలు పట్టుకుంటున్న ప్రిన్సిపాళ్లు
ఆలూరు, జూన్15(ఆంధ్రజ్యోతి): మండలంలోని కస్తూర్బా, మోడల్, గురుకుల పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఎంపీ, ఎమ్మెల్యేల వద్దకు వెళుతున్నారు. వారి నుంచి సిఫారసు లేఖలను తీసుకురావడంతో ప్రిన్సిపాళ్లు తలలు పట్టుకుంటున్నారు. స్థానిక నాయకులు సైతం తమవారికి సీటు ఇవ్వాలని ప్రిన్సిపాళ్లపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఏమి చేయాలో తెలియక ప్రన్సిపాళ్లు అయోమయానికి గురవుతున్నారు.
మిగిలిన స్టీలకు ప్రవేశాలు
మోడల్ స్కూల్‌లో 7, 8, 9 తరగతుల్లో మిగిలి పోయిన సీట్ల భర్తీకి ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ రాఘవరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 7వ తరగతిలో ఖాళీగా ఉన్న 4 సీట్లలో బీసీ-ఈ, బీసీ-బీ(జనరల్), ఎస్సీ(జనరల్), ఎస్టీ(జనరల్), ఎస్సీ (ఉమెన్), 9వ తరగతిలో 3 సీట్లు ఖాళీలు ఉండగా, ఎస్టీ (జనరల్), ఎస్సీ(జనరల్), బీసీ-డీ(ఉమెన్)కి రిజర్వు అయిందన్నారు.