Share News

సిల్వర్‌ సెట్‌ ఫలితాలు విడుదల

ABN , Publish Date - Jun 21 , 2025 | 11:09 PM

ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన కర్నూలులోని సిల్వర్‌ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి నిర్వహించిన సిల్వర్‌ సెట్‌-2025 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.

సిల్వర్‌ సెట్‌ ఫలితాలు విడుదల
కర్నూలులో ఫలితాలను విడుదల చేస్తున్న క్లస్టర్‌ వర్సిటీ ఇన్‌చార్జి వీసీ, రిజిస్ట్రార్‌

కర్నూలు అర్బన్‌, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన కర్నూలులోని సిల్వర్‌ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి నిర్వహించిన సిల్వర్‌ సెట్‌-2025 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. కర్నూ లులోని క్లస్టర్‌ వర్సిటీలో రాయలసీమ యూనివర్సిటీ వీసీ, క్లస్టర్‌ ఇన్‌చార్జి వీసీ వి.వెంకట బసవరావు, రిజిస్ట్రార్‌ కట్టా వెంకటేశ్వర్లు ఫలితా లను విడుదలచేసి వివరాలు వెల్లడించారు. మే 29న నిర్వహించిన పరీక్షకు బీఎస్సీ, బీజెడ్‌సీ, బీకాం, బీఏ కోర్సులకు సంబంధించి 1,196మంది విద్యార్థులు హాజరయ్యారని, వీరిలో 1,085 మంది అర్హత సాధించారని తెలిపారు. కౌన్సెలింగ్‌ తేదీలను త్వరలో వెల్లడి స్తామని చెప్పారు. సిల్వర్‌ జూబ్లీ కళాశాల ప్రిన్సిపాల్‌ జి. శ్రీనివాస్‌, ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఇందిరా శాంతి, కేవీఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ కె. వెంకటరెడ్డి, సిల్వర్‌ సెట్‌ కన్వీనర్‌ మహమ్మద్‌ వాహిద్‌, డీన్‌ నాగరాజశెట్టి, బాల సుబ్రహ్మణ్యం, అక్తర్‌ భాన్‌, అధ్యాపకులు ఎల్లాకృష్ణ, డి. శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 11:09 PM