Share News

సిల్వర్‌ సెట్‌ ప్రశాంతం

ABN , Publish Date - May 29 , 2025 | 11:19 PM

సిల్వర్‌ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించిన సిల్వర్‌ సెట్‌ గురువారం ప్రశాంతంగా ముగిసింది.

సిల్వర్‌ సెట్‌ ప్రశాంతం
పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న రిజిస్ట్రార్‌

కర్నూలు అర్బన్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): సిల్వర్‌ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించిన సిల్వర్‌ సెట్‌ గురువారం ప్రశాంతంగా ముగిసింది. కర్నూలులోని జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాల, ఎమ్మిగనూరులోని సెయింట్‌ జాన్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో నిర్వహించిన రెండు పరీక్షా కేంద్రాల్లో 90శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు క్లస్టర్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షలు నిర్వహణను ఆయనతో పాటు డీన్‌ డాక్టర్‌ మహ్మద్‌ వయీజ్‌ తదితరులు పరిశీలించారు.

Updated Date - May 29 , 2025 | 11:19 PM