Share News

బాలబ్రహ్మేశ్వర స్వామికి పట్టువస్త్రాలు

ABN , Publish Date - Sep 30 , 2025 | 11:45 PM

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభు త్వం తరుపున తెలంగాణ రాష్ట్రంలోని అలంపూరు క్షేత్రంలో వెలసిన జోగుళాంబ సమేత బాలబ్రహ్మేశ్వరస్వామి, అమ్మవార్లకు కర్నూలు కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి పట్టువస్త్రాలు సమర్పించారు.

బాలబ్రహ్మేశ్వర స్వామికి పట్టువస్త్రాలు
పట్టువస్త్రాలను సమర్పిస్తున్న కలెక్టర్‌ సిరి

ఏపీ ప్రభుత్వం తరపును సమర్పించిన కర్నూలు కలెక్టర్‌

కర్నూలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభు త్వం తరుపున తెలంగాణ రాష్ట్రంలోని అలంపూరు క్షేత్రంలో వెలసిన జోగుళాంబ సమేత బాలబ్రహ్మేశ్వరస్వామి, అమ్మవార్లకు కర్నూలు కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి పట్టువస్త్రాలు సమర్పించారు. మంగళవారం కలెక్టర్‌ స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించా రు. ముందుగా బాలబ్రహ్మేశ్వరస్వామి వారి కి అభిషేకాలు చేశారు. కలెక్టర్‌కు ఆలయ మ ర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప ట్టువస్త్రాల సమర్పణ అనంతరం వేద పండితుల వేదాశీర్వచనంతో తీర్థప్రసాదాలను అందజేశారు. దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ బి.సుధాకర్‌ రెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2025 | 11:45 PM