బ్రహ్మంగారికి పట్టు వస్త్రాలు
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:43 PM
పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జయంతిని పురస్కరించుకొని కందికాయపల్లె మఠంలో ఆదివారం మహానంది దేవస్థానం నుండి పట్టు వస్త్రాలను తీసికెళ్లి సమర్పిం చారు.
మహానంది, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జయంతిని పురస్కరించుకొని కందికాయపల్లె మఠంలో ఆదివారం మహానంది దేవస్థానం నుండి పట్టు వస్త్రాలను తీసికెళ్లి సమర్పిం చారు. ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డితో పాటు వేదపండితుడు హనుమంతు శర్మ, ప్రధాన అర్చకులు జనార్దన్‌శర్మ, శంకరయ్యశర్మ, తదిత రులు మహానంది నుండి వైఎస్‌ఆర్ జిల్లా కందికాయపల్లిలోని బ్రహ్మంగారి మఠానికి ప్రత్యేక వాహనంలో పట్టు వస్త్రాలను తీసుకెళ్ళారు. మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలను సమర్పించారు.