25 నుంచి ఉరుకుందలో శ్రావణ మాసోత్సవాలు
ABN , Publish Date - Jul 03 , 2025 | 11:57 PM
జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ఉరుకుంద ఈరన్న ఆలయంలో ఈ నెల 25 నుంచి శ్రావణ మాస ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో మేడిపల్లి విజయరాజు వెల్లడించారు.
కౌతాళం, జూలై 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ఉరుకుంద ఈరన్న ఆలయంలో ఈ నెల 25 నుంచి శ్రావణ మాస ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో మేడిపల్లి విజయరాజు వెల్లడించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించి భక్తులకు ఇబ్బందులు ఏర్పాట్లను ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటికే ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మాణం పూర్తయిందన్నారు. భక్తులు ఆలయం చుట్టూ నవ ప్రదక్షిణలు చేసేలా ఫ్లైఓవర్ బ్రిడ్జి చేపడుతున్నామన్నారు. భక్తులకు తాగునీరు ఇబ్బందులు లేకుండా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమన్వయం చేసుకుని ప్రత్యేక పైపులైన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై ఈ నెల 8న అన్ని శాఖల అధికా రులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహి స్తామన్నారు. ఈ సమావేశంలో ఆలయ సిబ్బంది మల్లికార్జున, వెంకటేశ్వరరావు, కిరణ్, కుమార్, అర్చకులు పాల్గొన్నారు.