Share News

ఎమ్మిగనూరు హౌసింగ్‌ ఏఈకి షోకాజ్‌ నోటీసులు

ABN , Publish Date - Jul 18 , 2025 | 11:32 PM

నిర్ధేశించిన లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయని ఎమ్మిగనూరు హౌసింగ్‌ ఏఈకి షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా హౌసింగ్‌ పీడీని ఆదే శించారు.

ఎమ్మిగనూరు హౌసింగ్‌ ఏఈకి షోకాజ్‌ నోటీసులు
మాట్లాడుతున్న కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా

సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్‌ సమీక్ష

కర్నూలు కలెక్టరేట్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): నిర్ధేశించిన లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయని ఎమ్మిగనూరు హౌసింగ్‌ ఏఈకి షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా హౌసింగ్‌ పీడీని ఆదే శించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర, పీ-4 పాలసీ, తల్లికి వందనం, హౌసింగ్‌, ఉపాధి హామీ అమలు అంశాలపై స్పెషల్‌ ఆఫీ సర్లు, డివిజన్‌ మండల స్థాయి అధికారులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆదోని డివిజన్‌లో 1,796, పత్తికొండ డివిజన్‌లో 1,241, కర్నూలు డివిజన్‌లో 705 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాల్సిందని ఆయా డివిజన్ల ఆర్డీవోలు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసు కోవాలని అన్నారు. ఆప్షన్‌ త్రీ కింద ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయని కాం ట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. తల్లికి వందనంకు సంబం ధించి వచ్చిన గ్రీవెన్స్‌లో భూమి ఎక్కువగా ఉందని, లేని ఆస్తులు రావడం, కరెంటు బిల్లులు ఎక్కువగా ఉందని, ఇన్‌కం ట్యాక్స్‌ తదితర ఫిర్యాదులు వచ్చాయనీ, ప్రత్యేక శ్రద్ద వహించి అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న ఫామ్‌ ఫండ్‌ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఉపాధి అధికారులను ఆదేశించారు. శానిటేషన్‌ అంశంలో కోసిగి మండలం దొడ్డి గ్రామంలో ఐవీఆర్‌ఎస్‌ ద్వారా నెగిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ వచ్చిందని, అందుకు సంబంధించిన యాక్షన్‌ టేకెన్‌ నివేదికను ఇవ్వడంతో పాటు సంబంధిత పంచాయతీ సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని డీపీవోను ఆదేశించారు. చిప్పగిరి మండలం బెల్డోన గ్రామంలో కూడా నెగిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ వచ్చిందని అక్కడకు వెళ్లి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను ఆదేశించారు. జూలై 21 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు బంగారు కుటుంబాలుగా గుర్తించిన వారి అవసరాలపై సర్వే నిర్వహిం చాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, సీపీవో హిమప్రభాకర్‌రాజు, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, హౌసింగ్‌ పీడీ చిరంజీవి, డ్వామా పీడీ వెంకటరమణయ్య, డీఈవో శామ్యూల్‌ పాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2025 | 11:32 PM