Share News

రైతు సేవా కేంద్రాన్ని కొనసాగించాలి

ABN , Publish Date - Oct 21 , 2025 | 11:31 PM

వేముగోడు గ్రామంలో రైతు సేవా కేంద్రాన్ని కొనసాగించాలని రైతుసంఘం జిల్లా కార్యదర్శి జి.రామక్రిష్ణ డిమాండ్‌ చేశారు.

రైతు సేవా కేంద్రాన్ని కొనసాగించాలి
కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న మణేకుర్తి గ్రామస్థులు

కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): వేముగోడు గ్రామంలో రైతు సేవా కేంద్రాన్ని కొనసాగించాలని రైతుసంఘం జిల్లా కార్యదర్శి జి.రామక్రిష్ణ డిమాండ్‌ చేశారు. మంగళవారం కలెక్టరేట్‌ వద్ద రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి.కోటకొండ సూరి అఽధ్యక్షతన దర్నా నిర్వహించారు. వేముగోడు గ్రామం నుంచి పుట్టపాశం గ్రామానికి తరలించడం అన్యాయమన్నారు. కలెక్టర్‌ స్పందించి కేంద్రాన్ని యథావిధిగా కొనసాగించాలన్నారు. ఉపాధ్యక్షుడు పి.హనుమంతు, ఈ.తాండ్రపాడు సర్పంచ్‌ బాలపీరా, జి.ఆంజనేయులు, మహబూబ్‌బాషా గ్రామ రైతులు పాల్గొన్నారు.

ఆలూరు మండలం మణేకుర్తి గ్రామంలో పవర్‌ గ్రిడ్‌ ఏర్పాటుకు సాగు భూములను లాకోవద్దని రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామక్రిష్ణ డిమాండ్‌ చేశారు. మంగళవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిం చారు. సాగు భూములను లాక్కునేందుకు రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నా రని ఆరోపించారు. కలెక్టర్‌ 74 మంది రైతుల నుంచి 192 ఎకరాల భూసేకరణ చేస్తున్నట్లు ప్రాథమిక ప్రకటన ఇచ్చారన్నారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. సూరి, హనుమంతు, ఆంజనేయులు, రాఘవేంద్ర, మనేకుర్తి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2025 | 11:31 PM