చట్టాలపై అవగాహన ఉండాలి
ABN , Publish Date - Jun 13 , 2025 | 12:21 AM
ప్రజలకు చట్టాలపై అవగాహన ఉండాలని ఆదోని 1వ అడిషనల్ జ్యుడీషియల్ న్యాయాధికారి సుభాష్ సూచించారు.
ఆదోని, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు చట్టాలపై అవగాహన ఉండాలని ఆదోని 1వ అడిషనల్ జ్యుడీషియల్ న్యాయాధికారి సుభాష్ సూచించారు. గురువారం పట్టణంలోని కల్లుబావిలో లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో బాల కార్మిక నిర్మూలన దినోత్సవం నిర్వహించారు. పిల్లలను బడికి పంపాలని, వారితో పరిశ్రమలు, హోటళ్లలో పనిచేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోర్డు నామినేటెడ్ మెంబర్ మమతా లోకేష్, టూటౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి కార్మిక అధికారులు ప్రతప్‌రెడ్డి, లీగల్ కమిటీ సభ్యులు కళ్యాణ్ రెడ్డి, బాలు, నాగరాజు, సూపర్న పాల్గొన్నారు.