‘న్యాక్’లో మెరుగైన ర్యాంకు సాధించాలి
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:31 AM
న్యాక్ ర్యాంకుల్లో మెరుగైన స్థానం సాధించాలని ఉపకులపతి వి. వెంకట బసవరావు ఆదేశించారు. గురువారం రాయలసీమ యూనివర్సీటీ లోని వీసీ కాన్పరెన్సు హాలులో ఆధ్యాపకులు, ప్రొఫెసర్లతో సమీక్షించారు.
కర్నూలు అర్బన్, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి) న్యాక్ ర్యాంకుల్లో మెరుగైన స్థానం సాధించాలని ఉపకులపతి వి. వెంకట బసవరావు ఆదేశించారు. గురువారం రాయలసీమ యూనివర్సీటీ లోని వీసీ కాన్పరెన్సు హాలులో ఆధ్యాపకులు, ప్రొఫెసర్లతో సమీక్షించారు. ఐక్యూఏసీ విభాగం ఆధ్వర్యంలో న్యాక్ ర్యాంకింగ్, బోధనతో పాటు పరిశోధన, కో కరిక్యులం, క్రీడలు, ఎన్‌సీసీ విభాగాల్లో వర్శిటీ చేస్తున్న కార్యక్రమాలను డాక్యుమెంటేషన్ చేసి ఆధారాలతో సహ సమర్పిస్తే న్యాక్ నుంచి ర్యాంక్ సాధించే అవకాశం ఉందన్నారు. ఇందుకు తీసుకోవలసిన చర్యలపై సలహాలు, సూచనలు అందించాల్సిందిగా ప్రొఫెసర్లను కోరారు. ప్రొఫెసర్ పాల్ క్లి మాట్లాడుతూ యూనివర్సీటీలో ఉన్న వసతులను, బోధన, పరిశోధనలను సమన్వయం చేసుకుంటూ ముందుకుపోతే మంచి ర్యాంక్ సాధించడం కష్టమేమి కాదని అభిప్రాయపడ్డారు. రిజిష్ట్రార్ విజయకుమార్ నాయుడు, ప్రిన్సిపాళ్లు సుందరానంద పుచ్చా, విశ్వనాథరెడ్డి, పరీక్షల విభాగం కంట్రోలర్ డా. ఎస్ వెంకటేశ్వర్లు, ఏక్యూఏసీ కోఆర్డినేటర్ ఆర్.భరత్ కుమార్, నరసింహులు, లైబ్రేరియన్ నాగభూషణం పాల్గొన్నారు.