‘నిఖా’ లఘుచిత్ర పోస్టర్ ఆవిష్కరణ
ABN , Publish Date - Oct 21 , 2025 | 11:28 PM
నగరానికి చెందిన నిర్మాత బోరెల్లి వెంకటరాముడు నిర్మిస్తున్న లఘుచిత్రం ‘నిఖా’ పోస్టర్‌ను రాజ్యసభ మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్, మంత్రి టీజీ వెంకటేశ్ మంగళవారం ఆవిష్కరించారు.
కర్నూలు కల్చరల్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): నగరానికి చెందిన నిర్మాత బోరెల్లి వెంకటరాముడు నిర్మిస్తున్న లఘుచిత్రం ‘నిఖా’ పోస్టర్‌ను రాజ్యసభ మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్, మంత్రి టీజీ వెంకటేశ్ మంగళవారం ఆవిష్కరించారు. యువతకు తమ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందన్నారు. ప్రభుత్వం తరపున సాయం చేస్తానని మంత్రి టీజీ భరత్ హామీ ఇచ్చారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, దర్శకుడు రవీంద్ర, మేనేజర్ చిన్న నరసింహులు, కథానాయకుడు ప్రదీప్, బండి నాగరాజు, నటులు ఆర్ట్ శ్రీను, బోరెల్లి వెంకటేశ్, కేఆర్‌పీ హనీ, రాజు తదితరులు పాల్గొన్నారు.