Share News

పన్నులు చెల్లించకపోతే దుకాణాలు సీజ్‌

ABN , Publish Date - Mar 19 , 2025 | 01:07 AM

నగర పాలకకు సంబంధించి ఆస్తి, కొళాయి పన్నులు, ట్రేడ్‌ లైసెన్సు రుసుములను త్వరగా చెల్లించకపోతే వాణజ్య సముదాయాల దుకాణాలను సీజ్‌ చేస్తామని నగర పాలక అడిషనల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ హెచ్చ రించారు.

పన్నులు చెల్లించకపోతే దుకాణాలు సీజ్‌
శ్రీచక్ర ఆస్పత్రి వద్ద నిరసన తెలుపుతున్న రెవెన్యూ సిబ్బంది

కర్నూలు న్యూసిటీ, మార్చి 18(ఆంధ్రజ్యోతి): నగర పాలకకు సంబంధించి ఆస్తి, కొళాయి పన్నులు, ట్రేడ్‌ లైసెన్సు రుసుములను త్వరగా చెల్లించకపోతే వాణజ్య సముదాయాల దుకాణాలను సీజ్‌ చేస్తామని నగర పాలక అడిషనల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ హెచ్చ రించారు. చెన్నమ్మ కూడలిలో సమీపంలోని శ్రీచక్ర హాస్పిటల్‌ కార్పే రేషనకు రూ.6.58 లక్షల ఆస్తి పన్ను బకాయిలు చెల్లించడంలో అల సత్వం వహిం చడంతో మంగళవారం రెవెన్యూ సిబ్బంది ఆసుపత్రి ఎదుట బ్యానర్లు, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అడిషనల్‌ కమిషనర్‌ మాట్లాడుతూ బకాయిదారులు త్వరగా పన్నులు చెల్లించకుంటే ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా దుకాణాలన సీజ్‌ చేస్తామన్నారు. ఇళ్లకు తాగునీటి కొళాయి కనెక్షన్లు తొలగిస్తా మన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్‌ జునైద్‌, రెవెన్యూ ఇన్సపె క్టర్‌ జీఎం.శ్రీకాంత, సచివాలయ అడ్మిన్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2025 | 01:07 AM