వైసీపీకి షాక్
ABN , Publish Date - Oct 03 , 2025 | 11:56 PM
కోడుమూరు నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. కర్నూలు మండలంలో నలుగురు ఎంపీటీసీ సభ్యులు వైసీపీకి గుడ్‌బై చెప్పారు.
నలుగురు ఎంపీటీసీ సభ్యులు టీడీపీలో చేరిక
కర్నూలు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం?
కర్నూలు రూరల్, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): కోడుమూరు నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. కర్నూలు మండలంలో నలుగురు ఎంపీటీసీ సభ్యులు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. ఈమేరకు శుక్రవారం కర్నూలులోని కేడీసీసీబీ చైర్మన్ డి.విష్ణువర్దన్‌రెడ్డి నివాసంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరితో కలిసి వైసీపీకి చెందిన నలుగురు ఎంపీటీసీలకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నూతనపల్లె, నందనపల్లె, రేమట, దిన్నెదేవరపాడు ఎంపీటీసీలు లక్ష్మీదేవి, జ్యోతి, కురువ సుజాత, రామనాథ్‌రెడ్డి సైకిల్ ఎక్కారు. అనంతరం వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేస్తున్న సంక్షేమ పథకాలు, పలు అభివృద్ధ్ది పనులను చూసి ఆకర్షితులమై టీడీపీలో చేరినట్లు వివరించారు. కర్నూలు మండలంలో నలుగురు వైసీపీ ఎంపీటీసీలు ఒకేసారి టీడీపీలో చేరడంతో ఎంపీపీ పీఠంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు టీడీపీ నాయకులు కసరత్తు ప్రారంభించారు. ఎంపీపీ పదవిపై టీడీపీ ఎంపీటీసీలు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే విష్ణువర్దన్‌రెడ్డి, బొగ్గుల దస్తగిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలిసింది. కార్యక్రమంలో సూదిరెడ్డిపల్లె వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ బి.వెంకటరాముడు, గార్గేయాపురం మాజీ సర్పంచ్ టి.కౌలుట్లయ్య, రేమట టీడీపీ నాయకులు కురువ చంద్రశేఖర్, రాఘవరెడ్డి పాల్గొన్నారు.