ఢిల్లీకి శివాని
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:03 AM
మద్దికెర గ్రామంలోని ఉప్పర వీరప్ప, లలిత కూతురు శివాని ప్రధాన మంత్రి జాతీయ బాల పురస్కార్ ఆంధ్రప్రదేశ్ పారా అథ్లెటిక్‌కు ఎంపిక కావడంతో గురువారం ఢిల్లీకి బయల్దేరింది.
రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్న అవార్డు
మద్దికెర, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మద్దికెర గ్రామంలోని ఉప్పర వీరప్ప, లలిత కూతురు శివాని ప్రధాన మంత్రి జాతీయ బాల పురస్కార్ ఆంధ్రప్రదేశ్ పారా అథ్లెటిక్‌కు ఎంపిక కావడంతో గురువారం ఢిల్లీకి బయల్దేరింది. శివాని హైదరాబాదులోని ఆదిత్య మెహతా ఫౌండేషన్‌లో పారా అథ్లెటిక్స్‌లో శిక్షణ తీసుకుంటుంది. జావెలిన్ త్రో, షాట్‌పుట్‌లో గత నాలుగేళ్లుగా కనబరుస్తున్న ప్రతిభను గుర్తించి ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ నెల 26న నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డు అందుకుంటుంది. అనారోగ్యంతో తల్లి దూరమైనా పట్టువదలకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తూ ఢిల్లీ వరకు ఎదిగిందని మద్దికెర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు ఉప్పర రంగయ్య, విద్యాకమిటీ వైస్ చైర్మన్ చంద్రహరి, శ్రీ విద్యాసాయి కళాశాల ఎండీ యజ్ఞం వెంకట మాధవ్, ప్రిన్సిపాల్ బాల సునీత ఆమెకు అభినందనలు తెలిపారు.