Share News

సొంత నిధులతో..

ABN , Publish Date - Aug 07 , 2025 | 12:33 AM

మండలంలోని హులేబీడు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 65 మంది విద్యార్థులు 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్నారు. రెండు గదులు మాత్రమే ఉండడంతో గదులు సరిపోకపోవడం లేదు. పిల్లల ఇబ్బందులను గమనించిన తల్లిదండ్రులు చేయి చేయి కలిపి రూ.2లక్షలు పోగు చేసుకుని పాఠశాల పక్కనే ఓ షెడ్డును, మూడు గదులు వచ్చేలా నిర్మిం చారు.

సొంత నిధులతో..
తల్లిదండ్రులు నిర్మించిన షెడ్డు ఇదే.. కొనసాగుతున్న తరగతులు

పాఠశాలలో షెడ్డు నిర్మించిన విద్యార్థులతో తల్లిదండ్రులు

ఆలూరు, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని హులేబీడు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 65 మంది విద్యార్థులు 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్నారు. రెండు గదులు మాత్రమే ఉండడంతో గదులు సరిపోకపోవడం లేదు. పిల్లల ఇబ్బందులను గమనించిన తల్లిదండ్రులు చేయి చేయి కలిపి రూ.2లక్షలు పోగు చేసుకుని పాఠశాల పక్కనే ఓ షెడ్డును, మూడు గదులు వచ్చేలా నిర్మిం చారు. విద్యాశాఖ అధికారులు కోమలదేవి, చిరంజీవిరెడ్డిలు గదులను పరిశీలించి తల్లిదండ్రులను అభినందించారు. ఈ గదులకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చి ఫ్యాన్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. దాతలు, పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి సహకరించాలని హెచ్‌ఎం వరలక్ష్మి కోరారు.

Updated Date - Aug 07 , 2025 | 12:33 AM