Share News

యోగాంధ్రలో ప్రజలను భాగస్వామ్యం చేయండి

ABN , Publish Date - May 22 , 2025 | 12:44 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన యోగాంధ్రలో ప్రజలు భాగస్వాములు అయ్యేలా చూడాలని కార్పొరేషన కమిషనర్‌ ఎస్‌.రవీంద్రబాబు సచివాలయ కార్య దర్శులను ఆదేశించారు.

యోగాంధ్రలో ప్రజలను భాగస్వామ్యం చేయండి
మాట్లాడుతున్న కమిషనర్‌ రవీంద్రబాబు

సచివాలయ సిబ్బందికి కమిషనర్‌ ఆదేశం

కర్నూలు న్యూసిటి, మే 21(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన యోగాంధ్రలో ప్రజలు భాగస్వాములు అయ్యేలా చూడాలని కార్పొరేషన కమిషనర్‌ ఎస్‌.రవీంద్రబాబు సచివాలయ కార్య దర్శులను ఆదేశించారు. బుధవారం ఎస్‌బీఐ ఎంప్లాయిస్‌ కాలనీలోని నగర పాలక సమావేశ మందిరంలో అడ్మిన, అమినిటిస్‌, ప్లానింగ్‌, శానిటేషన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన 21 వరకు యోగా ప్రాముఖ్యతను విస్తృత ప్రచారం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యోగాంధ్ర యాప్‌లో సుముఖంగా ఉన్న వారి వివరా లను నమోదు చేయాలని, వచ్చే నెల 21న కర్నూల్లో జరగనున్న అంత ర్జాతీయ యోగా దినోత్సవానికి పెద్దసంఖ్యలో ప్రజలు తరలి వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు.

అస్తి పన్ను మదింపు పక్కాగా చేపట్టండి

రాష్ట్ర వ్యాప్తంగా నగర, పట్టణాల్లో కొంత మంది యాజమానులు అధునాతన భవనాలు కట్టినా పాత ఇంటి బిల్లులు ఇంకా జనరేట్‌ అవు తున్నందున వాటిని పునః పరిశీలన ద్వారా సరి చేయాలని కమిషనర్‌ సచివాలయ సిబ్బందికి ఆదేశించారు. ఇంటింటి సర్వేను పక్కాగా చేప ట్టాలన్నారు. కొత్తగా భవనాలు నిర్మించినా, మొదటి అంతస్తు వరకు పన్ను వేసి, రెండు, మూడు అంతస్తులకు పన్నులు వేయకపోవడం, డాక్యూమెంట్లు సరిగా లేవని పన్నులు వేయకపోవడం వంటి అంశాల ను పరిగణలోకి తీసుకుని పునః పరిశీలించాలన్నారు. నగరంలోని పు నః పరిశీలన ద్వారా రూ. 15.54 కోట్ల అదనపు ఆదాయం రావా ల్సి ఉం దన్నారు. ట్యాప్‌ కనెక్షన్లు సైతం పరిశీలించాలన్నారు. వచ్చే నెల 15 వర కు ఈసర్వే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్‌ ఆర్జీవీ కృష్ణ, ఆర్‌ఓ జునైద్‌, సూపరింటెండెంట్లు వాజిత, ఆర్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2025 | 12:44 AM