ముగిసిన శరన్నవరాత్రి వేడుకలు
ABN , Publish Date - Oct 03 , 2025 | 11:53 PM
మహానంది క్షేత్రంలో దసరా పర్వదినం పురస్క రించుకొని ఆలయంలో ఈవో నల్లకాల్వ శ్రీనివా సరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు పూజలు ఘనంగా నిర్వహించారు.
మహానంది, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో దసరా పర్వదినం పురస్క రించుకొని ఆలయంలో ఈవో నల్లకాల్వ శ్రీనివా సరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు పూజలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం ఆలయంలోని ప్రత్యేక యాగశాల మంటపంలో రుత్వికులు దాతలతో చండీహోమం, యాగా లను భక్తిశ్రద్ధలతో చేశారు. ఉత్సవాలకు ముగిం పుగా పూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తుల విగ్రహాలను ప్రత్యేక పల్లకిపై ఆశీనులు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈశ్వర్ నగర్ కాలనీలోని జమ్మిచెట్టు వద్దకు ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. పూర్ణాహుతితో శర న్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి.
ఆకట్టుకున్న వేషధారణలు
మహానందిలో గురువారం రాత్రి విజయ ద శమి పురస్కరించుకొని స్థానికులు వేసిన దసరా వేషధారణలు, నృత్యాలు పలువురిని ఆకట్టుకొ న్నాయి. శక్తి, కాళీమాత, రక్తపింజరీ, దున్న పోతు, పిల్ల రక్షసులతో పాటు పలు వేషాలతో ఆలయం ముందు నిర్వహించిన నృత్యాలు తమ దైన శైలీలో నిర్వహించారు.
మహానందికి చేరుకున్న ఉత్సవమూర్తులు
దసరా ఉత్సవాల్లో భాగంగా ఆనవాయితీ ప్ర కారం నంద్యాల బ్రహ్మ నందీశ్వరుని ఆలయానికి వెళ్లిన మహానంది ఉ త్సవమూర్తుల విగ్రహాలు ఉత్సవాలు ముగియడంతో శుక్రవారం తిరిగి ప్రత్యేక పల్లకిపై నంద్యాల నుంచి మహానందికి చేరుకున్నాయి. స్థానిక గరుడ నందీశ్వరుని ఆల యం వద్ద ఉత్సవమూర్తులకు అధికారులు, వేద పండితులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం మహానంది ఆలయానికి చేర్చారు.