Share News

మహిళల భద్రతకు శక్తి యాప్‌

ABN , Publish Date - Sep 21 , 2025 | 12:21 AM

తమ భద్రతకు మహిళలు శక్తి యాప్‌ వాట్సాప్‌ సేవలను వినియోగించుకోవాలని మహిళా పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీ ఉపేంద్ర బాబు సూచించారు.

మహిళల భద్రతకు శక్తి యాప్‌
బి.క్యాంపు బాలికల ఉన్నత పాఠశాలలో శక్తీ టీమ్‌ సభ్యురాలు

నగరంలోని కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థునులకు అవగాహన కల్పించిన పోలీసులు

కర్నూలు క్రైం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తమ భద్రతకు మహిళలు శక్తి యాప్‌ వాట్సాప్‌ సేవలను వినియోగించుకోవాలని మహిళా పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీ ఉపేంద్ర బాబు సూచించారు. ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ ఆధ్వర్యంలో శక్తిటీం బృందాలు నగరంలోని పాఠశాలలు, కళాశాల ల్లో విద్యార్థినులకు అవగాహన కల్పించారు. గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌, ఫోక్సో చట్టాలు, ఈవ్‌ టీజింగ్‌ను వివరించారు. అత్యవసర సమయా ల్లో నేరుగా పోలీసులకు పిర్యాదు చేసేందుకు శక్తి వాట్సాప్‌ 7993485111ను ఫోన్‌లో సేవ్‌ చేసుకోవాలన్నారు. అలాగే 112, 1091, 1098, 181, 1930 నంబర్లకు డయల్‌ చేయొచ్చని మహిళల భద్రతకు పోలీసులు కృషి చేస్తార న్నారు. గంజాయి, డ్రగ్స్‌, మాదక ద్రవ్యాల విక్రయం, వినియోగం సమాచారాన్ని ఈగల్‌ టీం టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1972కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ ఏడాది 16,722 మంది మహిళలు శక్తి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు.

Updated Date - Sep 21 , 2025 | 12:21 AM