పార్టీకి చేసిన సేవలను గుర్తించారు
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:10 AM
టీడీపీకి చేసిన సేవలను పార్టీ అధిష్ఠానం గుర్తించిందని కర్నూలు 29వ డివిజన్ టీడీపీ ఇన్‌చార్జి శిండిగేరి శ్రీనివాసరావు అన్నారు.
కర్నూలు 29వ డివిజన్ టీడీపీ ఇన్‌చార్జి శ్రీనివాసరావు
రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఎంపిక
పాణ్యం, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): టీడీపీకి చేసిన సేవలను పార్టీ అధిష్ఠానం గుర్తించిందని కర్నూలు 29వ డివిజన్ టీడీపీ ఇన్‌చార్జి శిండిగేరి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా శ్రీని వాసరావును పాణ్యం నియోజకవర్గం నుంచి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పార్టీ పెద్దల కు, గౌరు కుటుంబానికి, మల్లెల రాజశేఖర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శ్రీనివాసరావు విద్యార్థి దశనుంచి కమ్యూనిస్టు భావాలతో పలు ఉద్యమాలు చేపట్టారు. గోనెగండ్ల మండలం, పెద్దమర్రి వీడు గ్రామానికి చెందిన ఈయనకు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. జిల్లా పార్మా మేనేజరు యూనియన్ వ్యవస్థాపక సభ్యులుగా, చిత్తూరు జిల్లా మెడికల్ రిప్రజెంటేటివ్ యూని యన్ అధ్యక్షుడిగా విధులు నిర్వహించారు. గౌరు కుటుంబంతో ఉన్న సత్సంబంధాలతో టీడీపీలో చేరిపార్టీకి సేవలందించారు. 2021లో కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 15 యేళ్లుగా బ్రాహ్మణ సామాజికవర్గం ఓట్లు టీడీపీకి వేయించడంలో తన వంతు కృషి చేశారు. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.