Share News

నాలుగో పట్టణ పోలీసులకు సేవా పతకాలు

ABN , Publish Date - Jul 08 , 2025 | 12:42 AM

కర్నూలు నాలుగో పట్టణ హెడ్‌ కానిస్టేబుల్‌ హాసన్‌ అహ్మద్‌, సుధాకర్‌లకు ఉత్కృష్ట సేవా పతకాలు వరించాయి.

నాలుగో పట్టణ పోలీసులకు సేవా పతకాలు
సేవా పతకాలు అందిస్తున్న సీఐ విక్రమసింహ

కర్నూలు క్రైం, జూలై 7(ఆంధ్రజ్యోతి): కర్నూలు నాలుగో పట్టణ హెడ్‌ కానిస్టేబుల్‌ హాసన్‌ అహ్మద్‌, సుధాకర్‌లకు ఉత్కృష్ట సేవా పతకాలు వరించాయి. 2023లో ఈ సేవా పతకాలు ప్రకటించగా.. 2024లో వీటిని అందించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో ఈ పతకాలను సోమవారం అందించారు. రాష్ట్ర డీజీపీ చేతుల మీదుగా అందుకోవాల్సి ఉండగా... నేరుగా జిల్లా పోలీస్‌ కార్యాలయానికి పంపించి సంబంధిత సిబ్బందికి అందించాలని ఆదేశాలు ఇవ్వడంతో వీటిని సోమవారం రాత్రి నాలుగో పట్టణ సీఐ విక్రమసింహ వారికి అందించారు. ఈ సేవా పతకాలు పొందిన ఈ ఇద్దరిని సీఐ విక్రమసింహ అభినందించారు.

Updated Date - Jul 08 , 2025 | 12:42 AM