పని మనిషే ప్రాణం తీసింది..
ABN , Publish Date - Sep 10 , 2025 | 12:28 AM
మూడో పోలీ్‌సస్టేషన్ పరిధిలో సాయి వైభవ్ నగర్‌లో ఈనెల 1వ తేదీన జరిగిన కాటసాని శివలీల హత్య కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం మధ్యాహ్నం ఎస్పీ విక్రాంత్ పాటిల్, డీఎస్పీబాబు ప్రసాద్, సీఐ లు శేషయ్య, చంద్రబాబునాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు
శివలీల హత్య కేసులో నిందితురాలి అరెస్టు
ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): మూడో పోలీ్‌సస్టేషన్ పరిధిలో సాయి వైభవ్ నగర్‌లో ఈనెల 1వ తేదీన జరిగిన కాటసాని శివలీల హత్య కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం మధ్యాహ్నం ఎస్పీ విక్రాంత్ పాటిల్, డీఎస్పీబాబు ప్రసాద్, సీఐ లు శేషయ్య, చంద్రబాబునాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. కేసు వివరా లను వెల్లడించారు. ఈహత్యకు కారణమైన ఆ ఇంట్లో పని చేసే కురువ వరలక్ష్మిని అరెస్టు చేశారు. వరలక్ష్మి కొద్ది కాలంగా శివలీల ఇంట్లో పని చేస్తుంది. శివలీల ఇంట్లో ఒంటరిగా ఉంటుందని భావించి తనకు డబ్బు అవసరం కాగా ఆమెను చంపి నగలు కాజేయాలని చూసింది. కొద్దికాలంగా ప్రణాళిక రూపొందించుకుంది. ఇటీవల ఆమెను పని నుంచి తొలగించేశారు. అయితే ఈ నెల 1వ తేదీన మరోసారి కాటసాని శివలీల ఇంటికి వచ్చి పనికి మరలా వస్తానని కోరింది. శివలీల వెనక్కు తిరిగి మాట్లాడుతుండగా.. ముందుగానే సిద్ధంగా ఉంచుకున్న రోకలి బండతో శివలీల తలపై కొట్టింది. దీంతో ఆమె కింద పడి పోగానే... మరో ఐదారుసార్లు బలంగా కొట్టింది. ఆమె కొనఊపిరితో ఉండగా.. ఆమె మెడ లోని బంగారు చైన్, నాలుగు గాజులు, బెడ్ రూంలో ఉన్న మరి కొంత నగదు తీసుకుని పరారైంది. దీంతో ఆరు చెక్‌బుక్కులు, ఏడు పాస్‌బుక్కులు కూడా తాను వెంట తీసుకెళ్లింది.
ఆ రోజు ఆమె ఎక్కడెక్కడికి వెళ్లింది
హత్య చేసిన రోజు నిందితురాలు తమ సొంతూరైన గోపాలనగరం వెళ్లి ఉదయం వితంతు పింఛన్ తీసుకుంది. డోన్ నుంచి కర్నూలుకు వచ్చింది. కర్నూలులో గుత్తి పెట్రోల్ బంకు వద్ద బస్సు దిగింది. అక్కడి నుంచి ఆటోలో రైతుబజారు వరకు వచ్చి అక్కడి నుంచి ముఖానికి మాస్కు ధరించి నేరుగా శివలీల ఇంటికి వెళ్లినట్లుగా గుర్తించారు.
డీఎస్పీ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి..
పట్టపగలే శివలీల హత్య నగరంలో కలకలం సృష్టించింది. పోలీసులు ఈకేసును సీరి యస్‌గా తీసుకున్నారు. డీఎస్పీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో సీఐలు పలువురు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. మొదటగా దారిదోపిడీ దొంగలు అయింటారని భావించారు. ఆ సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఎక్కడా అనుమానాస్పద వ్యక్తులు తారస పడలేదు. మరోవైపు హత్య జరిగిన తర్వాత కూడా ఆ ఇంట్లో నుంచి ఎవరూ బయటకు వచ్చిన దాఖలాలు కూడా కనిపించలేదు. సుమారు రాత్రి పొద్దుపోయే దాకా ఐదారు మంది సీఐలు, 25 మందికి పైగా కానిస్టేబుళ్లు ఈ కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. అదే రోజు రాత్రి ఓ సీసీ కెమెరాను పరిశీలిస్తే ఓ మహిళ ముఖానికి ముసుగు ధరించి అటువైపు వెళ్తున్నట్లుగా గుర్తించారు. ఈ ఫొటోను మృతురాలి కూతురికి చూపించారు. ఆమె కూడా అనుమానంగా గుర్తించింది. పోలీసులు పనిమనిషి వరలక్ష్మి కోసం గాలించగా.. ఆమె పరారీలో ఉన్నట్లు గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆమెను గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారిస్తే తానే హత్య చేసినట్లుగా నేరాన్ని అంగీకరించింది. ఆ తర్వాత తీసుకున్న సొత్తుతో హత్య చేశాక ఎవరికి అనుమానం రాకుండా వెనుకనుంచి గోడదూకి పరారైంది. దీంతో ఎక్కడా సీసీ కెమెరాల్లో కూడా నిందితురాలి జాడ కనిపించలేదు. చోరీ సొత్తును బందువుల ఇళ్లలో దాచింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని చోరీ చేసిన సొత్తును మొత్తం స్వాధీనంచేసుకున్నారు. కేసు ఛేదించడంలో ప్రతిభ చూపిన హెడ్ కాని స్టేబుళ్లు శ్రీనివాసులు, జి.ప్రతా్‌పకుమార్, శేఖర్‌బాబు, జే.శేఖర్, చంద్రబాబు నాయుడు, పరమేశ్వరుడు, సమీర్, వీరబాబు, నాగరాజు, రాముడు, ఇబ్రహీంను ఎస్పీ అభినందించారు.