తడి, పొడి చెత్త వేరుచేయాలి
ABN , Publish Date - Nov 29 , 2025 | 12:19 AM
: నగర ప్రజలు, వ్యాపారులు తడి-పొడి చెత్తను వేరు సిబ్బందికి ఇవ్వాలని కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు. శుక్రవారం గార్గేయపురం డంప్‌యార్డును పరిశీలించారు. యంత్రాలు, వర్మికంపోస్టు పిట్స్, కంపోస్టు తయారీ యూనిట్, కుక్కల సంతాన నియంత్రణ కేంద్రం, చెత్త వర్గీకరణను తనిఖీ చేశారు.
డంప్‌యార్డును తనిఖీచేసిన కమిషనర్ విశ్వనాథ్
కర్నూలు న్యూసిటీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): నగర ప్రజలు, వ్యాపారులు తడి-పొడి చెత్తను వేరు సిబ్బందికి ఇవ్వాలని కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు. శుక్రవారం గార్గేయపురం డంప్‌యార్డును పరిశీలించారు. యంత్రాలు, వర్మికంపోస్టు పిట్స్, కంపోస్టు తయారీ యూనిట్, కుక్కల సంతాన నియంత్రణ కేంద్రం, చెత్త వర్గీకరణను తనిఖీ చేశారు. శునకాలకు ఆహారం, శుభ్రతను నిర్లక్ష్యం చేయవద్దని సూచిం చారు. డంప్‌యార్డుకు చేరు తున్న చెత్తలో పెద్ద మొత్తంలో మిశ్రమ వ్యర్థాలు ఉండటం కారణంగా రీసైక్లింగ్ వ్యవస్థపై భారం పెరుగుతుందన్నారు. బహిరంగ ప్రదేశాల్లోని వీధి కుక్కలను గార్గేయపురం డంప్‌యార్డుకు తరలిస్తున్నట్లు తెలిపారు. డి.సి. సతీష్‌కుమార్‌రెడ్డి, కార్యదర్శి నాగరాజు, ఇంచార్జి ఎస్‌ఈ శేషసాయి, ఎంఈ మనోహర్‌రెడ్డి, ప్రజారోగ్య అధికారి డా.నాగశివప్రసాద్, డీఈఈలు ఫణిరాం, క్రిష్ణలత, వెటర్నరీ వైద్యుడు మల్దన్న పాల్గొన్నారు.