Share News

ఏసీబీ వలలో సీనియర్‌ అసిస్టెంట్‌

ABN , Publish Date - Dec 22 , 2025 | 11:06 PM

డోన్‌లో ఏసీబీ వలకు మరో చేప చిక్కుకుంది. పట్టణంలో సబ్‌ ట్రెజరీ కార్యాలయంపై ఏసీ బీ అధికారులు దాడులు చేశారు.

ఏసీబీ వలలో సీనియర్‌ అసిస్టెంట్‌
డోన్‌లో లంచం తీసుకుంటూ పట్టుబడిన సబ్‌ ట్రెజరీ సీనియర్‌ అసిస్టెంట్‌ లక్ష్మణ్‌ నాయక్‌

రూ.30వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

డోన్‌ టౌన్‌/ రూరల్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): డోన్‌లో ఏసీబీ వలకు మరో చేప చిక్కుకుంది. పట్టణంలో సబ్‌ ట్రెజరీ కార్యాలయంపై ఏసీ బీ అధికారులు దాడులు చేశారు. సబ్‌ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌ లక్ష్మణ్‌నాయక్‌ రూ.30వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాలు.. డోన్‌ మున్సిపాలిటీ రెవెన్యూ విభాగంలో పనిచేసి సామ్రాజ్‌ అనే వ్యక్తి పదవీ విరమణ పొందారు. ఆయన పెన్షన్‌కు సంబంధించిన బెనిఫిట్స్‌ కోసం ఐదు నెలల నుంచి సబ్‌ ట్రెజరీ కార్యాలయం చుట్టూ తిరిగారు. సీనియర్‌ అసిస్టెంట్‌ లక్ష్మణ్‌నాయక్‌ ఈపనిచేసేందుకు రూ.45వేలు డిమాండ్‌ చేయగా రూ.35వేలకు డీల్‌ కుదిరింది. విసిగిపోయిన ఆయన ఏబీసీని ఆశ్రయిం చారు. సోమవారం సబ్‌ట్రెజరీ కార్యాలయంలో లక్ష్మణ్‌నాయక్‌ రూ.30వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అదికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకు న్నారు. నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదుచేశారు. ఈదాడుల్లో ఏసీబీ డీఎస్పీ సోమన్న, సీఐలు కృష్ణయ్య, శ్రీని వాస్‌, రాజ్‌ ప్రభాకర్‌, శ్రీనివాసులు, సిబ్బంది ఉన్నారు. మంగళవారం నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ సోమన్న తెలిపారు.

Updated Date - Dec 22 , 2025 | 11:06 PM