Share News

రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపండి

ABN , Publish Date - Mar 16 , 2025 | 12:47 AM

జిల్లాలో ముఖ్యమైన రోడ్ల నిర్మాణాలు అవసరం ఉంటే ప్రతిపాదనలు పంపాలని రహదారులు, భవనాలు, రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కాంతిలాల్‌ దండే ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు.

రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపండి
మాట్లాడుతున్న అధికారి కాంతిలాల్‌ దండే

జిల్లా ఇన్‌చార్జి అధికారి కాంతిలాల్‌దండే

కర్నూలు కలెక్టరేట్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ముఖ్యమైన రోడ్ల నిర్మాణాలు అవసరం ఉంటే ప్రతిపాదనలు పంపాలని రహదారులు, భవనాలు, రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కాంతిలాల్‌ దండే ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్లో రోడ్ల నిర్మాణాలు, ఇతర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య, ఆర్‌అండ్‌బీఎస్‌ఈ మహేశ్వరరెడ్డి, డీటీసీ శాంతకుమారి, నేషనల్‌ హైవే ఎస్‌డీసీ సునీత పాల్గొన్నారు.

జిల్లాను అభివృధ్ది పథంలో నడిపిద్ధాం

జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిద్దామని జిల్లా ఇన్‌చార్జి ఆఫీసర్‌, రహదారులు, భవనాలు, రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కాంతిలాల్‌దండే పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్లో జిల్లాలో చేపడుతున్న ఫ్లాగ్‌షిఫ్‌ కార్యక్రమాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్‌ రంజిత్‌ బాషా, జేసీ నవ్య, అసిస్టెంట్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, డీఆర్వో వెంకటనారాయణమ్మ, సీపీవో హిమప్రభాకర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 12:47 AM