బావుల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపండి
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:52 AM
నగరంలోని జొహరాపురంలో శివారులోని పురాతన బావులను అభివృద్ధి చేసి, పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నగర పాలక అధికారులను ఆదేశించారు
నగర పాలక సంస్థ అధికారులకు మంత్రి టీజీ భరత్ ఆదేశం
జొహరాపురంలో బావుల పరిశీలన
కర్నూలు న్యూసిటీ, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి):నగరంలోని జొహరాపురంలో శివారులోని పురాతన బావులను అభివృద్ధి చేసి, పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నగర పాలక అధికారులను ఆదేశించారు. సోమవారం జొహరాపురం సమీపంలోని తప్పెటగేరి, చెన్నకేశవ, నర్సప్ప బావులను కమిషనర్ పి.విశ్వనాథ్‌తో కలిసి పరిశీలించారు. నగర అభివృద్ధి మౌళిక వసతులతో పాటు పర్యాటక అవకాశాలను పెంచేలా ఉండాలన్నారు. బావులను అభివృద్ధి చేస్తే ప్రజలకు విశ్రాంతి, వినోదంతో బాటు, భూగర్భజలాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఎ.క్యాంపు నుంచి కిమ్స్ ఆసుపత్రి వరకు డివైడర్‌ను అభివృద్ధి చేసి సుందరీకరించాలని సూచించారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండ డ్రైనేజీని పటిష్టం చేయడంతోపాటు పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఇన్‌చార్జి ఎస్‌ఈ శేషసాయి, ఎంఈ మనోహర్‌రెడ్డి, డీఈఈ క్రిష్ణలత, ఏఈ జనార్ధన్, నగర పాలక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.