భూసేకరణ ప్రతిపాదనలు పంపండి: కలెక్టర్
ABN , Publish Date - Sep 23 , 2025 | 12:25 AM
జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పారిశ్రామిక ప్రాజెక్టులు, విద్యాసంస్థలు, సంక్షేమ వసతిగృహాలు, రోడ్లు భవనాల నిర్మాణం వంటి పనులకు అవసరమైన భూసేకరణకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
నంద్యాల హాస్పిటల్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పారిశ్రామిక ప్రాజెక్టులు, విద్యాసంస్థలు, సంక్షేమ వసతిగృహాలు, రోడ్లు భవనాల నిర్మాణం వంటి పనులకు అవసరమైన భూసేకరణకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎ్‌సహాల్‌లో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టుకు ఎంత భూమి అవసరమవుతుందో సంబంధిత శాఖలు స్పష్టమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలన్నారు. ప్రాజెక్టుల వారీగా భూములను సిద్ధంచేయడంలో ఆలస్యం జరిగితే సంబంధిత శాఖలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. భూ సేకరణకు సంబంధించి పబ్లిక్‌హెల్త్ శాఖకు ఆళ్లగడ్డ, నందికొట్కూరులలో ఎస్టీపీసీ ప్రాజెక్టు, యూఐడీఎఫ్ స్కీం కింద 2ఎకరాలు, గృహనిర్మాణాలకు పట్టణ ప్రాంతాల్లో వంద ఎకరాలు, బనగానపల్లెలో ఎంజేపీ స్కూల్, ఆళ్లగడ్డ పట్టణంలో బాలుర వసతిగృహానికి 50సెంట్లు, బాలికల వసతిగృహానికి 50సెంట్లు, నంద్యాల పట్టణంలోబీసీ భవన్‌కు 50సెంట్లు, డోన్, బనగానపల్లె, కోవెలకుంట్ల, శ్రీశైలంలోని ఆరు సంక్షేమ వసతిగృహాలకు 50సెంట్ల చొప్పున అవసరమని అధికారులు సూచించారని కలెక్టర్ పేర్కొన్నారు. ఖజానా శాఖకు ఆర్థిక సమీకృత భవనానికి 50 సెంట్లు, ఔట్‌డోర్ స్టేడియానికి 15ఎకరాలు, నియోజకవర్గాల్లోని పశువుల వసతిగృహాలకు అవసరమైన భూములు, డోన్, ఆళ్లగడ్డలో వంద పడకల ఆస్పత్రికి 2ఎకరాలు చొప్పున, పిన్నాపురం, యు.బొల్లవరం, బిళ్లలాపురం, కానాల స్కూళ్లకు 5ఎకరాల చొప్పున, అల్లూరులో రెసిడెన్షియల్ హాస్టల్‌కు 10ఎకరాలు అవసరమని సంబంధిత శాఖలు సూచించిన నేపథ్యంలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జేసీ విష్ణుచరణ్, డీఆర్వో రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.