కుట్టు శిక్షణతో వెలుగు
ABN , Publish Date - May 23 , 2025 | 12:18 AM
: కుట్టు శిక్షణ బీసీ మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. స్త్రీశక్తిగా ఎదగాలని, స్వయం ఉపాధితోనే ఇది సాధమన్న ప్రభుత్వ ఆశయం పేదలకు ఆర్థిక స్వావలబంన ఇస్తోంది.
బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
శిక్షణ అనంతరం కుట్టుమిషన్ల పంపిణీ
స్వయం ఉపాధి పొందుతామంటున్న మహిళలు
హాలహర్వి, మే 22 (ఆంధ్రజ్యోతి): కుట్టు శిక్షణ బీసీ మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. స్త్రీశక్తిగా ఎదగాలని, స్వయం ఉపాధితోనే ఇది సాధమన్న ప్రభుత్వ ఆశయం పేదలకు ఆర్థిక స్వావలబంన ఇస్తోంది.
ఉచితంగా కుట్టు మిషన్లు
కుట్టు శిక్షణ 90 రోజులపాటు ఉంటుంది. శిక్షణకు 75 రోజుల పాటు హాజరైన వారికి ప్రభుత్వం ఉచితంగా కుట్టు మిషన్ అందజేస్తుంది. దీంతో మహిళలు స్వయం ఉపాధి పొందేం దుకు అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం తమకు భరోసా ఇచ్చిందని మహిళలు అంటున్నారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు..
బీసీ కార్పొరేషన్ తరపున ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే మహిళలకు శిక్షణ ఇస్తారు. మహిళలు స్వయం ఉపాధి పొందా లన్న లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది.
కుట్టుతో పాటు ఎంబ్రాయిడరింగ్‌లో శిక్షణ
హాలహర్వి మండలంలో దాదాపు 70 మంది వరకు మహిళలకు కుట్టు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ ప్రారంభించి నెల పూర్తవుతోంది. టైలరింగ్, అల్లికలు, ఎంబ్రాయిడరింగ్, రకరకాల ఫ్యాషన్లలో కుట్టు నేర్పిస్తున్నారు.
కుట్టు శిక్షణతో భరోసా
మాది నిరుపేద కుటుంబం. నేను పొలం పని చేయలేను. నా భర్త కూలితో కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రభుత్వం ఇస్తున్న ఉచిత కుట్టుశిక్షణకు రోజూ వస్తున్నారు. పూర్తయితే నాకు ఎంతో భరోసాగా ఉంటంది. - ముత్తమ్మ, హాలహర్వి
మహిళలు ఉపయోగించుకోవాలి
ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యం లో పేద మహిళలకు ఉచితంగా కుట్టుశిక్షణ ఇచ్చి, కుట్టు మిషన్లు కూడా ఇస్తుంది. మహిళలు ఉపయోగించుకునిఉపాధి పొందాలి. కుటుంబాలను పోషించుకోవాలి. - వరలక్ష్మి, ఎంపీడీవో, హాలహర్వి