Share News

జిల్లా స్థాయి ఉత్తమ గురువుల ఎంపిక

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:16 AM

జిల్లా విద్యా శాఖలో ఉత్తమ సేవలు అందించిన 30 మందిని ఉపాధ్యాయులను ఉత్త మ అవార్డుకు ఎంపిక చేశారు.

జిల్లా స్థాయి ఉత్తమ గురువుల ఎంపిక

30 మంది ఉపాధ్యాయులు, 14 మంది అధ్యాపకులకు అవార్డులు

కర్నూలు ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లా విద్యా శాఖలో ఉత్తమ సేవలు అందించిన 30 మందిని ఉపాధ్యాయులను ఉత్త మ అవార్డుకు ఎంపిక చేశారు. ఉపాధ్యాయులు విద్యతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో చేసిన సేవల ను గుర్తించి వారిని జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేశారు. అలాగే జిల్లా ఇంర్మీడియట్‌ బోర్డు ఆఽధ్వర్యంలో ప్రభుత్వ జూని యర్‌ కళాశాలల్లో ఉత్తమ సేవలు అందించిన 14 మంది అధ్యాప కులను గుర్తించి జిల్లా స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపిక చేశారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యా య అవార్డుకు ఎంపికైన వారికి కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడి టోరియంలో ఉదయం 10 గంటలకు రాష్ట్ర పరిశ్రమల, వాణి జ్య, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌, కలెక్టర్‌ రంజిత్‌ బాషా చేతుల మీదుగా ఉత్తమ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు డీఈవో శామ్యూల్‌పాల్‌ గురువారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా జడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, నగర మేయర్‌ బీవై రామయ్య, ప్ర జాప్రతినిధులు, జిల్లా అధికారులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - Sep 05 , 2025 | 12:16 AM