Share News

ఇంటిల్లిపాది అటువైపే

ABN , Publish Date - Jun 11 , 2025 | 12:26 AM

వర్షాలు పడితే చాలు ప్రతి ఒక్కరూ వేట షురూ చేస్తారు. అది మామూలు వేట కాదు... వజ్రాల వేట. వర్షం తమకు అదృష్టాన్ని తీసుకొస్తుందా? లేదా? అని ఆశగా

ఇంటిల్లిపాది అటువైపే
జొన్నగిరి పొలాల్లో వజ్రాల వేట

పొలాల్లోనే వంటావార్పు

వాహనాల్లో వస్తున్న ఆశావహులు

త్తికొండ, తుగ్గలి, మద్దికెరలో వజ్రాల కోసం అన్వేషణ

తుగ్గలి, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): వర్షాలు పడితే చాలు ప్రతి ఒక్కరూ వేట షురూ చేస్తారు. అది మామూలు వేట కాదు... వజ్రాల వేట. వర్షం తమకు అదృష్టాన్ని తీసుకొస్తుందా? లేదా? అని ఆశగా చూస్తుంటారు. సాధార ణంగా వర్షాకాలం మొదలైందంటే అన్నదా తలు ఆకాశం వైపు చూస్తారు. చినుకు పడితే చాలు వారి ఆనందానికి అవధులు ఉండవు. కానీ అక్కడ మాత్రం రైతులతో పాటు సామాన్య ప్రజలు, ఉద్యోగులు వేలాదిగా తరలివచ్చి వజ్రాల కోసం అన్వేషిస్తుంటారు. వరుణ దేవుడి రాక కోసం ప్రార్థనలు చేస్తారు. ఒక్క తొలకరి వర్షంతో లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపో వాలనే ఆశతో వజ్రాల అన్వేషణ చేస్తుంటారు. తొలకరి వర్షాలతో భూ ఉపరితలంపై ప్రత్యక్షమయ్యే వజ్రాల కోసం పత్తికొండ, తుగ్గలి, మద్దికెర ప్రాంతాలకు వేలాదిమంది తరలి వస్తుంటారు. కర్నూలు, అనంత పురం, మహబూబ్‌ నగర్‌, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి సైతం ఈ వజ్రాలను వెతికేందుకు కార్లు, ప్రత్యేక వాహనాల్లో ఆశగా వస్తున్నారు.

పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని తుగ్గలి, మద్దికెర మండలాల పరిదిలోని ఎర్రగుడి, జొన్నగిరి, చిన్నజొన్నగిరి, పగడి రాయి, అమినాబాద్‌, తుగ్గలి, మదనంతపురం, పెరవలి పంటపొలాల్లో విలువైన వజ్రాలు దొరుకుతుంటాయి. వజ్రాలు దొరుకుతున్నాయని సామాజిక మాధ్య మాల్లో ప్రచారం కావడంతో నంద్యాల, తాడిపత్రి, అనంతపురంతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా వజ్రాన్వేషకులు ఇక్కడకు వచ్చి అన్వేషిస్తున్నారు.

ఈ ఏడాది వేల సంఖ్యలో వజ్రాన్వేషకులు ఆటోలలో, కార్లలో ఇంటిల్లి పాది వచ్చి అన్వేషిస్తు న్నారు. వచ్చిన వారు దాదాపు నెల రోజులు, వారం రోజులకు సరిపడా బియ్యం, సరుకులు తీసుకుని వచ్చి ఇక్కడే పొలాల్లోనే వంట చేసుకుంటూ వజ్రాల కోసం వెదుకు లాట ప్రారంభించారు. కొందరు చిన్నారులతో పాటు రావడంతో వారికి వారి వాహనాల్లోనూ, చెట్లకు ఊయల ఏర్పాటు చేసి నిద్రపుచ్చుతున్నారు.

ఫ ఈ విషయంపై వజ్రాన్వేషితుల నుంచి వివరణ కోరగా.. పనులేమీ లేక అప్పుల బాధ నుంచి బయట పడాలని, ఇంటిల్లి పాది వచ్చామని, ఇక్కడ హోటల్‌లో భోజనం చేస్తే అధిక ధరలు వెచ్చించాల్సి వస్తుందని, బియ్యం, బేడలు తెచ్చుకుని వంట చేసుకుని తింటున్నామని చెప్పారు. ఒక వజ్రం దొరికితే తమ జీవితాలు మారుతాయని వేలాది మంది ఆశావహులు ఎంతో ఆశతో వజ్రాన్వేషణ చేస్తున్నారు.

Updated Date - Jun 11 , 2025 | 12:26 AM