ముగిసిన నామినేషన్ల పరిశీలన
ABN , Publish Date - Jul 25 , 2025 | 11:14 PM
నగరపాలక సంస్థ స్థాయీ సంఘం కమిటీ సభ్యుల ఎన్ని కలకు సంబంధించి నామినేషన్ల పరిశీ లన ప్రక్రియ పూర్తయింది.
కర్నూలు న్యూసిటీ, జూలై 25(ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ స్థాయీ సంఘం కమిటీ సభ్యుల ఎన్ని కలకు సంబంధించి నామినేషన్ల పరిశీ లన ప్రక్రియ పూర్తయింది. శుక్రవారం నగరపాలక కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ ఆర్‌జీవి.కృష్ణ అధ్యక్షతన అభ్యర్థుల సమక్షంలో పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సక్రమంగా ఉండటంతో అన్నింటిని ఆమోదించినట్లు అడిషనల్ కమిషనర్ పేర్కొన్నారు. 28న విత్ డ్రా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మేనేజర్ చిన్నరాముడు, సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్, అభ్యర్థులు నా రాయణరెడ్డి, ఎస్‌టీ.షేక్ అహ్మద్, కార్పొ రేటర్ శ్రీనివాసరావు తదితరులున్నారు.