ఉచిత శిక్షణ కోసం స్ర్కీనింగ్ టెస్టు
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:03 AM
యూపీపీఎస్‌సీ సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల కోసం ఉచిత శిక్షణ పొందే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్‌లో ఆదివారం స్ర్కీనింగ్ టెస్టు నిర్వహించినట్లు డీబీసీడబ్ల్యూవో ప్రసూన తెలిపారు.
డీబీసీ డబ్ల్యూవో ప్రసూన
కర్నూలు ఎడ్యుకేషన్, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): యూపీపీఎస్‌సీ సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల కోసం ఉచిత శిక్షణ పొందే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్‌లో ఆదివారం స్ర్కీనింగ్ టెస్టు నిర్వహించినట్లు డీబీసీడబ్ల్యూవో ప్రసూన తెలిపారు. ఈపరీక్షకు కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి మొత్తం 69మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 48మంది కర్నూలుకు చెందిన వారు కాగా, 21మంది నంద్యాలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు. ఈ పరీక్షకు 57 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, 12 మంది గైర్హాజరయ్యారు. ప్రశాంతంగా పరీక్ష జరిగినట్లు ఆమె తెలిపారు.