Share News

స్కూల్‌ బస్సులు నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - Nov 05 , 2025 | 11:55 PM

జిల్లాలో పాఠశాల బస్సులు నడిపేవారు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని జిల్లా రవాణా శాఖాధికారి (డీటీవో) శివారెడ్డి అన్నారు.

స్కూల్‌ బస్సులు నిబంధనలు పాటించాలి
మాట్లాడుతున్న రవాణా శాఖ అధికారి

డీటీవో శివారెడ్డి

నంద్యాల టౌన్‌, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పాఠశాల బస్సులు నడిపేవారు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని జిల్లా రవాణా శాఖాధికారి (డీటీవో) శివారెడ్డి అన్నారు. బుధవారం నంద్యాల జిల్లా రవాణా కార్యాలయంలో పాఠశాల యజమానులతో, బస్సు డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీటీవో మాట్లాడుతూ.. రోడ్డుపై భద్రతా ప్రమాణాలు పాటిం చాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. నైపుణ్యం కలిగినవారిని మాత్రమే డ్రైవర్లగా తీసుకోవాలన్నారు. డిప్యూటీ డీఈవో మాట్లాడుతూ పాఠశాలలు రవాణా శాఖ వారు చెప్పిన నిబంధనలు పాటించాలని, అలా చేయనివారిపై చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులను సురక్షి తంగా గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీవో శ్రీకాంత్‌, ఏంవీఐ సుబ్బయ్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2025 | 11:55 PM