పాఠశాల ఇలా.. చదువు ఎలా?
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:24 AM
మండలంలోని తిప్పాయపల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. ఇక్కడ తమ పిల్లలు ఉంటే ప్రమాదమని తల్లిదండ్రులు అభ్యంతరం తెలపడంతో విద్యార్థులకు పంచా యతీ కార్యాలయంలో చదువు చెబుతున్నారు.
శిథిలావస్థలో తిప్పాయిపల్లె పాఠశాల
పంచాయతీ ఆఫీసులో తరగతులు
ఓర్వకల్లు, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తిప్పాయపల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. ఇక్కడ తమ పిల్లలు ఉంటే ప్రమాదమని తల్లిదండ్రులు అభ్యంతరం తెలపడంతో విద్యార్థులకు పంచా యతీ కార్యాలయంలో చదువు చెబుతున్నారు. తిప్పాయపల్లె గ్రామంలో 1961లో పాఠశాలను ప్రారంభించారు. 64 సంవత్సరాలు గడిచినా నూతన భవనాలను నిర్మించలేదు. పాఠశాలలో 23 మంది విద్యార్థులు ఉండగా.. ఇద్దరు ఉపాధ్యా యులు చదువులు చెబుతున్నారు. గదులు శిథిలావస్థకు చేరి పెచ్చులూడుతున్నాయి. పాఠశాల దుస్థితిని గమనించిన గ్రామస్థులు పంచాయతీ కార్యాలయంలో తగరతులు నిర్వహించుకునే ఏర్పాటు చేశారు.
అలాగే పాఠశాల సమీంలోనే ఉన్న అంగన్‌వాడీ కేంద్రం కూడా శిథిలావస్థకు చేరింది. 22 సంవత్సరాల నిర్మించినది కావడంతో పెచ్చులు ఊడుతున్నాయి. టీచర్లు, చిన్నారులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వీటిలో సోమయా జులపల్లె మజరా గ్రామం చెన్నంచెట్టిపల్లె, చింతలపల్లె గ్రామాని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి నూతన భవనాలు నిర్మించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
నివేదికలు పంపాం
తిప్పాయపల్లె, చెన్నంచెట్టి పల్లె, చింతలపల్లె గ్రామాల్లో పాఠశాలలు అధ్వాన్నంగా ఉన్నాయని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సహ కారంతో ప్రభుత్వానికి నివేదకలు పంపాం. నిధులు మంజూరైన వెంటనే నూతన తరగతి గదులు నిర్మిస్తాం. - ఓంకార్ యాదవ్, ఎంఈవో ఓర్వకల్లు