మూతబడి
ABN , Publish Date - Jul 08 , 2025 | 01:18 AM
మండలంలో ఉపాధ్యాయుల కొరతతో ప్రభుత్వ విద్యావస్థ అధ్వానంగా ఉంది. ప్రాథమిక పాఠశాలలు 26, ఉన్నత పాఠశాలలు 9, కేజీబీవీ పాఠశా ఉండగా, 6,300 మంది విద్యార్థులు చదువుతున్నారు.
హాలహర్వి మండలంలో 101 మంది ఉపాధ్యాయుల కొరత
మూతపడుతున్న బడులు
హాలహర్వి, జూలై 7(ఆంధ్రజ్యోతి): మండలంలో ఉపాధ్యాయుల కొరతతో ప్రభుత్వ విద్యావస్థ అధ్వానంగా ఉంది. ప్రాథమిక పాఠశాలలు 26, ఉన్నత పాఠశాలలు 9, కేజీబీవీ పాఠశా ఉండగా, 6,300 మంది విద్యార్థులు చదువుతున్నారు.
బడిలో చదువు లేదు..
మారుమూల గ్రామమైన హాలహర్విలో ఉపాధ్యా యుల కొరత తీవ్రంగా ఉంది. దాదాపు వంద మంది ఉపాధ్యాయుల కొరత ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడికి నియమింపబడిన ఉపాధ్యాయులు పనిచేయలేమని వెళ్లిపోతున్నారు. దీంతో పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. బడిలో టీచర్లు లేరని ఎం చేయాలని పిల్లలు ఇంటి వద్ద అల్లరి చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ పట్ల ఆందోళన చెందుతున్నారు.
101 ఉపాధాయుల కొరత..
మండలంలో 123 మంది ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా కేవలం 22 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 101 మంది ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నారు. 11 ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయులతో కొనసాగుతు న్నాయి. ఉపాధ్యాయులు సమావే శాలు, సెలవులో వెళితే ఇక అంతే. ఇక సిరిగాపురం, అమృతాపురం, పచ్చారపల్లి గ్రామాల పాఠశాలలోల అసలు ఉపాధ్యాయులే లేరు. దీంతో పాఠశాలలు తెరుచుకోవడం లేదు.
బడులు మూతపడుతున్నాయి.
మా ఊరిలో పాఠశాల ఉన్నా పాధ్యాయుడు లేడు. దీంతో బడి మూతపడింది. మారుమూల పల్లెల్లో జీవించమే మా నేరమా. ప్రభుత్వ అధికారులు స్పందించి ఉపాధ్యాయులను నియమించాలి. - రామదాసు, పచ్చారపల్లి
ఉపాధ్యాయుల కొరతతో ఇబ్బంది
ఉపాధ్యాయుల కొరతతో ఇబ్బందిగా ఉంది. 101 మంది ఉపాధ్యాయులు తక్కువగా ఉంటే బడులు ఎలా నడపాలో అర్థం కావడం లేదు. 24 గ్రామాల్లో 26 పాఠశాలలు ఉండగా, కేవలం 22 మంది ఉపాధ్యాయులే ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్లమని చెప్పాలో అర్థం కావడం లేదు. విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం, మరోసారి తీసుకెళతాం. - ఈరన్న, ఎంఈవో, హాలహర్వి