ఎస్‌బీఐ సేవలు అభినందనీయం
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:00 AM
మంత్రాలయంలో శ్రీమఠానికి, భక్తులు, ఖాతాదారులకు ఎస్‌బీఐ అందిస్తున్న సేవలు అభినందనీయమని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ జానకిరామన్ అన్నారు.
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ జానకిరామన్
మంత్రాలయం, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయంలో శ్రీమఠానికి, భక్తులు, ఖాతాదారులకు ఎస్‌బీఐ అందిస్తున్న సేవలు అభినందనీయమని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ జానకిరామన్ అన్నారు. శనివారం మధ్యాహ్నం మంత్రాలయం ఎస్‌బీఐ బ్రాంచ్‌ను ఆయన పరిశీలించారు. బ్యాంకులో పనిచేస్తున్న మేనేజర్ రాజశేఖర్‌తో ఖాతాదారులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. శ్రీమఠానికి సామాజిక సేవలో భాగంగా ఎస్‌బీఐ అన్ని రకాలుగా చేయుతనందించడంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. బ్యాంకు సేవలను మరింత విస్తృతం చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్‌అధికారి రామచంద్ర నాయక్, నరేంద్ర, ఉరుకుందమ్మ, మహేష్, నీలకంఠ, రాఘవేంద్ర, రవి, భాషా, రహంతుల్లా, సద్దాంహుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
రాఘవేంద్రుడి సేవలో... మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని శనివా రం ఉదయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ జానకి రామన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంత్రాలయానికి వచ్చిన వీరికి అబోడే త్రీస్టార్ హోటల్ వద్ద ఎస్‌బీఐ డీజీ ఎం హేమ, రీజనల్ మేనేజర్ టి.శ్రీనివాస్, మేనేజర్ రాజశేఖర్ శాలువ కప్పి ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను మఠం సంప్రదాయం ప్రకారం సత్కరించారు.