Share News

నటులకు స్ఫూర్తి మహానటి ‘సావిత్రి’

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:39 PM

నేటితరం నటులకు స్ఫూర్తిప్రదాత మహానటి సావిత్రి అని డీఈవో శామ్యూల్‌ పాల్‌ అన్నారు. ఆదివారం రాత్రి నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో, సావిత్రి 90వ జయంతి నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ సా విత్రి అభినయాన్ని మరెవ్వరూ అనుకరించ లేరని, సహజనటిగా తెలుగు, తమిళ చిత్రసీమలో రాణించారని అన్నారు.

నటులకు స్ఫూర్తి మహానటి ‘సావిత్రి’
నివాళి అర్పిస్తున్న డీఈవో శామ్యూల్‌ పాల్‌

డీఈవో శామ్యూల్‌ పాల్‌

కర్నూలు కల్చరల్‌, డిసెంబరు 7 (ఆంధ్ర జ్యోతి): నేటితరం నటులకు స్ఫూర్తిప్రదాత మహానటి సావిత్రి అని డీఈవో శామ్యూల్‌ పాల్‌ అన్నారు. ఆదివారం రాత్రి నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో, సావిత్రి 90వ జయంతి నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ సా విత్రి అభినయాన్ని మరెవ్వరూ అనుకరించ లేరని, సహజనటిగా తెలుగు, తమిళ చిత్రసీమలో రాణించారని అన్నారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మా ట్లాడుతూ కళాక్షేత్రాన్ని మరింత హంగులతో తీర్చిదిద్దుతున్నామని, కొత్తగా సౌండ్‌సిస్టమ్‌, కర్టెన్లు, లైటింగ్‌ సిస్టమ్‌లో మార్పులు చేసి, కొత్త వేదికను సిద్ధం చేశామని తెలిపారు. రాజ్యసభ మాజీ సభ్యుడు, కళాక్షేత్రం ఛైర్మన్‌ టీజీ వెంకటేశ్‌ సూచనల మేరకు కళాక్షేత్రాన్ని ఏసీ సౌండ్‌ ట్రాక్‌ సిస్టమ్స్‌తో కూడిన అత్యాధునిక థియేటర్‌లో చూసిన అనుభూతిని ప్రతి ప్రేక్షకుడు ఆస్వాదిస్తారని తెలిపారు. సావిత్రి నటించిన చిత్రాల్లోని పాటలకు చిన్నారి సుధేష్ణ చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ ఇంద్రజాలికుడు కె. శివశంకర్‌ ప్రదర్శించిన మ్యాజిక్‌ షో, వెంట్రిలాక్విజమ్‌ అలరింప జేసింది. వ్యాఖ్యాత ఎస్‌ఎండీ ఇనాయతుల్లా, కళాకారులు మహ్మద్‌ మియా, పి. రాజారత్నం, కేవీ రమణ, గాండ్ల లక్ష్మన్న, యాగంటీశ్వరప్ప, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2025 | 11:39 PM