సస్యరక్షణతో పంటలను కాపాడుకోండి
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:14 AM
అధిక వర్షాల నేపథ్యంలో పంటలు దెబ్బతినకుండా సస్యరక్షణ చర్యలతో కాపాడుకోవాలని ఏవో సురేష్ యాదవ్ సూచించారు.
తుగ్గలి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): అధిక వర్షాల నేపథ్యంలో పంటలు దెబ్బతినకుండా సస్యరక్షణ చర్యలతో కాపాడుకోవాలని ఏవో సురేష్ యాదవ్ సూచించారు. మంగళవారం బొంది మడుగులలో ‘పొలం పిలుస్తుంది’ నిర్వహించారు. పొలంలోని నీటిని తొలగిం చాలని ఎకరాకు లీటరు నీటిలో నానో యూరియా, లీటరు నానో డీఏపీని పిచికారీ చేయాలన్నారు. కంది పంటలో వర్షం నీటిని తొలగించాక 319 పొటాషియం వేసుకోవాల న్నారు. వ్యసాయాధికారుల సూచనల మేరకే మందులను వాడాలని సూచించారు. ఎంపీఈవోలు రంగన్న, నాగరాజు, గోపాల్, నాగమల్లేష్ ఉన్నారు