రైతులు పంటలను కాపాడుకోవాలి
ABN , Publish Date - Aug 21 , 2025 | 01:42 AM
పది రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు పంటలను కాపాడాకోవాలని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త కే.రాఘవేంద్ర చౌదరి సూచించారు.
కేవీకే సమన్వయకర్త రాఘవేంద్ర
మద్దికెర ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): పది రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు పంటలను కాపాడాకోవాలని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త కే.రాఘవేంద్ర చౌదరి సూచించారు. బుధవారం మద్దికెర, బురుజుల గ్రామాల్లో పొలం పిలుస్తుందిలో భాగంగా వర్షాలకు దెబ్బతిన్న పంటలు పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. కంది లో అధిక తేమను తట్టుకోవడానికి 500 ఎంఎల్ నానో డీఏపీ, 500 ఎంఎల్ నానో యూరియా పిచికారీ చేయాలన్నారు. అదే విదంగా 500 గ్రాముల సీవోసీని మొక్కల వేర్లు తడిసేలా పిచికారీ చేసుకోవాలన్నారు. ఆముదం పంటలో కాయకుళ్లు తెగులు నివారణకు ఎంట్రాకల్ 500 ఎంఎల్ ర ఎకరానికి పిచికారీ చేయాలని, పత్తిలో రసం పీల్చు పురుగుల నివారణకు ప్రిపోనిల్, ఇమిదా చెలోఫ్రిడ్ పిచికారీ చేసుకోవాలని సూచించారు. పొలాల్లోని నీటినకి బయటకు పంపాలన్నారు. ఇష్టానుసారంగా మందులు పిచికారీ చేయకుండా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఏఏ పీటీసీ సమన్వయకర్త సుజాత, ఏవో యు.రవి, ఏఈవో బోజరాజు, వీఏఏ ఆనంద్, వంశీ, ఎంపీఈవో హేమసుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.