Share News

మా అమ్మను కాపాడండి

ABN , Publish Date - Oct 30 , 2025 | 12:22 AM

తల్లిని తన తండ్రి హింసిస్తున్నాడని ఏడుస్తూ ఏడేళ్ల బాలుడు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన నంద్యాలలో చోటుచేసుకుంది.

మా అమ్మను కాపాడండి
పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న బాలుడు

తండ్రి హింసిస్తున్నాడని చిన్నారి ఫిర్యాదు

నంద్యాల టౌన్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : తల్లిని తన తండ్రి హింసిస్తున్నాడని ఏడుస్తూ ఏడేళ్ల బాలుడు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన నంద్యాలలో చోటుచేసుకుంది. టూటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు సాయిబాబనగర్‌కు చెందిన జయమ్మ భర్త రాంభూపాల్‌ వేధింపులు తాళలేక ఆత్మహత్నా యత్నానికి పాల్పడింది.దీంతో స్థానికులు నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తండ్రి రాంభూపాల్‌ ఆసుపత్రి వద్దకు వచ్చి కూడా తల్లిని వేధిస్తుండండంతో తట్టుకోలేని ఏడేళ్ల చిన్నారి బాలుడు ప్రభుత్వాస్పత్రి నుంచి నేరుగా టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తండ్రి రాంభూపాల్‌పై ఫిర్యాదు చేశాడు. పోలీసులు స్పందించి రాంభూ పాల్‌కు కౌన్సెలింగ్‌ ఇచ్చి ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు. చిన్నారిని తల్లి వద్దకు చేర్చారు.

Updated Date - Oct 30 , 2025 | 12:23 AM