Share News

హంద్రీ నదిని కాపాడండి

ABN , Publish Date - Oct 11 , 2025 | 12:06 AM

నగరంలో ప్రవహిస్తున్న హంద్రీ నదిని కాపాడాలని రాయలసీమ యూనివర్సిటీ పూర్వ అధ్యాపకురాలు పి.ఇంద్రాదేవి ఆవేదన వ్యక్తం చేశారు

హంద్రీ నదిని కాపాడండి
హంద్రీ నదిలో వ్యర్థాలను పరిశీలిస్తున్న నాయకులు

కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): నగరంలో ప్రవహిస్తున్న హంద్రీ నదిని కాపాడాలని రాయలసీమ యూనివర్సిటీ పూర్వ అధ్యాపకురాలు పి.ఇంద్రాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పట్టణ పౌర సంక్షేమ సంఘం అధ్వర్యంలో కిసాన్‌ ఘాట్‌ నుంచి కల్లూరు హంద్రీ వంతన వరకు నదిని పరిశీలించారు. మురుగు చేరకుండా, వ్యర్థపదార్థాలు వేయకుండ చర్యలు తీసుకోవాలన్నారు. హంద్రీ నదిని కబ్జాల నుంచి కాపాడాలన్నారు. కలెక్టర్‌ జోక్యం చేసుకుని నది కుచించుకుపోకుండా చర్యలు తీసుకుని సుందరీకరించాలని డిమాండ్‌ చేశారు. సభ్యులు ఈ.పుల్లారెడ్డి, నాయకులు సి.రాము, వై.రామాంజనేయులు, వెంకటపతి, యూనుస్‌, ధీర్‌జ్‌ పాల్గొన్నారు

Updated Date - Oct 11 , 2025 | 12:06 AM