Share News

పర్యావరణాన్ని పరిరక్షించాలి

ABN , Publish Date - Jun 05 , 2025 | 12:06 AM

మానవ మనుగ డకు పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉం దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తెలిపారు. బుధవారం స్థానిక న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణపై సమీక్ష సమావేశం నిర్వ హించారు.

పర్యావరణాన్ని పరిరక్షించాలి
అధికారులతో సమీక్షిస్తున్న బి.లీలా వెంకటశేషాద్రి

కర్నూలు లీగల్‌, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): మానవ మనుగ డకు పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉం దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తెలిపారు. బుధవారం స్థానిక న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణపై సమీక్ష సమావేశం నిర్వ హించారు. ప్రతిఒక్కరూ పర్యావరణంపై అవగాహన పెంచేందుకు కృషి చేయాలన్నారు. భూమి, నీరు, గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులతో చర్చించారు. ప్రజలు ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలని కోరారు. మొక్కలను నాటి వాటిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కర్నూలు మున్సిపల్‌ కమిషనర్‌ రవీంద్ర బాబు, డీఎంహెచ్‌వో శాంతికళ, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఈఈ కిషోర్‌రెడ్డి, కర్నూలు ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 12:06 AM