Share News

పేదలను ఆదుకోవడంలో సంతృప్తి

ABN , Publish Date - Aug 01 , 2025 | 11:28 PM

పేదలకు సాయంచేసి వారిని ఆదుకోవడంలో ఎంతో సంతృప్తి ఉంటుందని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు.

పేదలను ఆదుకోవడంలో సంతృప్తి
దత్తత తీసుకున్న తులశమ్మతో కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

ఒంటరి వృద్ధురాలి దత్తత

నంద్యాల ఎడ్యుకేషన్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): పేదలకు సాయంచేసి వారిని ఆదుకోవడంలో ఎంతో సంతృప్తి ఉంటుందని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. పట్టణంలోని గోపాల్‌నగర్‌లో నిర్వహిస్తున్న ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీలో శుక్రవారం కలెక్టర్‌ పాల్గొని పలువురికి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా 15వ వార్డులో నివాసం ఉంటున్న ఒంటరి మహిళ తులశమ్మ కుటుంబ పరిస్థితిపై ఆరాతీసి కలెక్టర్‌ చలించిపోయారు. ఆమె కుటుంబాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. గతంలో చెంచుగూడెంలోని నెమలికుంటలో 29 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నామని, నేడు తులశమ్మతో కలిపి 30కుటుంబాలు అవుతాయన్నారు. వారికి జీవనోపాధి, మౌలిక సదుపాయాలు కల్పించి అన్నివిధాలుగా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శేషన్న పాల్గొన్నారు.

Updated Date - Aug 01 , 2025 | 11:28 PM