సత్యసాయి సేవలు శాశ్వతం
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:44 PM
భగవాన్ సత్యసాయి బాబా ప్రాజెక్టుల నిర్మాణం పరంగా, వైద్యకళాశాలలు, విద్యాసంస్థల పరంగా చేసిన సేవలు శాశ్వతమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు.
ఎంపీ బస్తిపాటి నాగరాజు
కర్నూలు కలెక్టరేట్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): భగవాన్ సత్యసాయి బాబా ప్రాజెక్టుల నిర్మాణం పరంగా, వైద్యకళాశాలలు, విద్యాసంస్థల పరంగా చేసిన సేవలు శాశ్వతమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. ఆదివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీమాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 166 దేశాల్లో సాయి సేవా సంస్థలు ఉన్నాయన్నారు. సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విద్యా, వైద్యం, మానవత, ఆధ్యాత్మిక సామాజిక సేవలను అందించారన్నారు. కలెక్టర్ సిరి మాట్లాడు తూ సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే ఐదు సూత్రాల మీద బాబా జీవితాన్ని గడిపారన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తదితరులు పాల్గొన్నారు.