ఘనంగా సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:41 PM
నంద్యాల సంజీవనగర్‌లోని సత్యసాయి కల్యాణ మండపంలో ఆదివారం భగవాన్ సత్యసాయి బాబా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
హాజరైన కలెక్టర్ , జిల్లా అధికారులు
నంద్యాల కల్చరల్, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): నంద్యాల సంజీవనగర్‌లోని సత్యసాయి కల్యాణ మండపంలో ఆదివారం భగవాన్ సత్యసాయి బాబా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నంద్యాల సత్యసాయి కల్యాణ మండపంలో రాష్ట్ర ప్రఽభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు కలెక్టర్ రాజకుమారి, జేసీ కార్తీక్, పలువురు జిల్లా స్ధాయి అఽధికారులు పాల్గొన్నారు. సత్యసాయి భక్త బృందంతో భక్తిపాటలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సత్యసాయి కళ్యాణమండపానికి స్ధలం ఇచ్చిన దాతలను, సత్యసాయి భక్తులను, సత్యసాయి కళ్యాణ మండపంలోని నిర్వహకులను, పేదమహిళలకు కుట్టుమిషన్లు(3), పేదవిద్యార్ధులకు నగదు బహుమతి(3), నారాయణసేవ భక్తులకు వస్త్రాలు, తదితర కార్యక్రమాలను ముఖ్యఅతిఽథి కలెక్టర్, జిల్లా అధికారుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. సత్యసాయిబాబా చిత్రపటానికి ఊంజల్ సేవా కార్యక్రమం నిర్వహిచారు. డీఆర్వో రామునాయక్, ఆర్‌డివో విశ్వనాద్, కమీషనర్ శేషన్న, సత్యసాయిబాబా భక్తులు తదితరులు పాల్గొన్నారు.