ఘనంగా సత్యసాయిబాబా శతజయంతి
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:36 AM
స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలను ఎంపీడీవో తాహిర్‌హుసేన ఆధ్వర్యంలో నిర్వహించారు.
చాగలమర్రి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలను ఎంపీడీవో తాహిర్‌హుసేన ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను కొనియా డారు. సీనియర్ సహాయకులు బాలనరసింహులు, కార్యదర్శి ఆదినారా యణ, ఎంసీవో రాజ్‌కుమార్, షేక్షావలి పాల్గొన్నారు.
కొలిమిగుండ్ల: మండలంలో సత్యసాయిబాబా శత జయంతి వేడు కలు ఆదివారం నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వో ప్రసాద్ రెడ్డి, 108 అధికారి పవన గోపాల్‌లు సత్యసాయి చిత్రపటానికి పూలమాలలు వేశారు. సత్యసాయిబాబా మాతృమూర్తి ఈశ్వరమ్మ పుట్టిన ఊరు కొలిమిగుండ్ల కావడం ఎంతో అదృష్టమని పలువురు వక్తలు కొనియాడారు.