Share News

పంచాయతీ నిధులను సర్పంచ్‌ కాజేశారు

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:32 AM

సర్పంచ్‌, ఆమె కుటుంబ సభ్యులు పంచాయతీ నిధులను కాజేశారని సాతనూరు గ్రామస్థులు వెంకటేశ్‌, నజీర్‌తో సుమారు వంద మంది గ్రామస్థులు ఆరోపించారు. సమాచారం హక్కు చట్టం కింద సమాచారం తీసుకున్నారు.

పంచాయతీ నిధులను సర్పంచ్‌ కాజేశారు
బురద రోడ్డును చూపుతున్న సాతనూరు గ్రామస్థులు

ఎంపీడీవోకు సాతనూరు గ్రామస్థుల ఫిర్యాదు

కోసిగి ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): సర్పంచ్‌, ఆమె కుటుంబ సభ్యులు పంచాయతీ నిధులను కాజేశారని సాతనూరు గ్రామస్థులు వెంకటేశ్‌, నజీర్‌తో సుమారు వంద మంది గ్రామస్థులు ఆరోపించారు. సమాచారం హక్కు చట్టం కింద సమాచారం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఎంపీడీవో ఈశ్వరయ్యస్వామికి ఫిర్యాదు చేశారు. గ్రామస్థులు మాట్లాడుతూ 2024-25 మధ్య కాలంలో సాతనూరు పంచాయతీ నుంచి సర్పంచ్‌, కుటుంబ సభ్యులు రూ.1.20 కోట్లు నిధులు మంజూరు చేయగా.. అందులో రూ.40 లక్షలు మాత్రమే పనులు చేసినట్లు తెలిసిందని, మిగతా డబ్బులకు ఏవేవో లెక్కలు చూపి పంచాయతీ సర్పంచ్‌, కుటుంబ సభ్యులు కాజేశారని ఆరోపించారు. గ్రామంలోని బీసీ, ఎస్సీ, వాల్మీకి నగర్‌లో నేటికీ కూడా బురద రోడ్లు, డ్రైనేజీ లేని రోడ్లు ఉన్నాయని, తాగడానికి నీరు సక్రమంగా రావడం లేదని, వీది లైట్లు, దోమల బెడద అధికంగా ఉందని, ఫాగింగ్‌ కూడా చేయడం లేదని అన్నారు. గతంలో పని చేసిన పంచాయతీ అధికారుల అండదండలతో వారికి మామూళ్లు ఇచ్చుకుని సాతనూరు పంచాయతీలో తప్పుడు బిల్లులు చూపించి స్వాహా చేశారని గ్రామస్థులు ఆరోపించారు. అలాగే గ్రామంలోని బురద రోడ్లను, ఇళ్ల ముందు వర్షపు నీరు నిల్వ ఉండడాన్ని చూపారు. గ్రామస్థుల ఫిర్యాదుపై విచారిస్తామని ఎంపీడీవో చెప్పారు.

Updated Date - Aug 24 , 2025 | 12:32 AM